విజయ్ నీ స్వార్థ రాజకీయం కోసం ఎంతమంది బలి కావాలి.. అలాంటి పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చిన కాయదు లోహర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-28 12:40:30  IST  )

తమిళనాడు కరూర్‌లో దళపతి విజయ్ (Thalapathy Vijay)భారీ ర్యాలీ నిర్వహించారు.

విజయ్ నీ స్వార్థ రాజకీయం కోసం ఎంతమంది బలి కావాలి.. అలాంటి  పోస్ట్‌తో ట్విస్ట్ ఇచ్చిన కాయదు లోహర్
X

దిశ, సినిమా: తమిళనాడు కరూర్‌లో దళపతి విజయ్ (Thalapathy Vijay)భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఇందులో అత్యధికంగా జనాలు పాల్గొనడంతో తొక్కిసలాట జరిగింది. ఇక ఇందులో 38మంది చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయి. ఈక్రమంలో.. కాయదు లోహర్(Kayadu Lohar) పేరుతో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘తమిళనాడులో జరిగిన ప్రమాదంలో నా సన్నిహితులను కోల్పోయాను. విజయ్ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్. నీ స్టార్ డమ్ కోసం ఎంతమంది చనిపోవాలి. ఇదంతా నీ స్వార్థ రాజకీయం వల్లే జరిగింది’’ అని అందులో రాసి ఉంది.

కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. తాజాగా, ఈ విషయంపై కాయదు లోహర్ స్పందిస్తూ.. ‘‘నా పేరుతో ఓ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. అదంతా ఫేక్.. దయచేసి నమ్మకండి. కరూర్‌లో జరిగిన ఘటన నా మనసులు కలిచివేసింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అయితే, కరూర్‌లో నాకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని మరియు నా పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం అబద్ధమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మకండి.. ప్రచారం చేయకండి’’ అని రాసుకొచ్చింది.

లింక్

Next Story