- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ డేటింగ్‌లో ఉన్నది ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో కాదా!!
దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. విడుదలకు ముందే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. కాగా.. ఈనెల 25న లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్ తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై అడిగిన ప్రశ్నకు ఈ విధంగా ఓపెన్ అయ్యాడు.
''నా పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టడం ఇష్టం ఉండదు. నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే. కానీ, పబ్లిక్‌లో ఫోకస్ కావడం తనకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ రిలేషన్‌లో ఉన్నారు కానీ.. ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా విజయ్ స్టేట్‌మెంట్‌తో రష్మికతో డేటింగ్ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






