విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

by Disha Web Desk 6 |
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ మరోసారి కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ ‘ఫ్యామిలీ స్టార్’తోపాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇందులో పిల్లలను స్కూల్‌కు పంపిస్తూ నిజంగా ఫ్యామిలీ మెన్‌లా కనిపించాడు విజయ్.

తర్వత ‘లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు కొనడం, పిల్లలను రెడీ చేయడం అనుకున్నావా సెటిల్‌మెంట్ చేయడమంటే’ అంటూ విలన్ అడగడంతో వెంటనే ‘ఉల్లిపాయలు తెస్తే మనిషి కాదా.. పిల్లలను రెడీ చేస్తే మగాడు కాదా.. ఐరన్ వంచాలా’ అంటూ పక్కనే ఉన్న ఐరన్ రాడ్‌ను బెండ్ చేస్తాడు విజయ్. బ్యాక్‌గ్రౌండ్‌లో విలన్ వాయిస్ కూడా చాలా గంభీరంగా వినిపించగా.. చివరలో ‘ఏవండి’ అనే మృణాల్ పిలుపుతో గ్లింప్స్ ఎండ్ అయింది.


Next Story