Vijay Deverakonda: దానికి ఎప్పటికీ నా హార్ట్‌లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-30 10:40:45  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Vijay Deverakonda: దానికి ఎప్పటికీ నా హార్ట్‌లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని వెల్లడించారు.

2014 ఉత్తమ చిత్రం - రన్ రాజా రన్

2015 ఉత్తమ చిత్రం - రుద్రమదేవి

2016 ఉత్తమ చిత్రం - శతమానం భవతి

2017 ఉత్తమ చిత్రం - బాహుబలి కంక్లూజన్

2018 ఉత్తమ చిత్రం - మహానటి

2019 ఉత్తమ చిత్రం - మహర్షి

2020 ఉత్తమ చిత్రం - అల వైకుంఠపురంలో

2021 ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్

2022 ఉత్తమ చిత్రం -సీతారామం

2023 ఉత్తమ చిత్రం - బలగం

ఇక ఇందులో 2016వ సంవత్సరంలో వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘పెళ్లి చూపులు’ రెండవ ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కావడం విశేషం. తాజాగా, ఈ విషయంపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా కీలక నోట్ రిలీజ్ చేశాడు. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాకు కాంతారావు స్మారక పురస్కారం రావడం చాలా గౌరవంగా ఉంది. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు రావడం నా అదృష్టం. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపికైనందుకు కూడా కృతజ్ఞుడను. ఈ సినిమా నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అవార్డును నా అభిమానులదే. వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. నా కుటుంబానికి, నా టీమ్‌కు, ఈ ప్రయాణంలో నడిపించినందుకు స్పెషల్ థాంక్స్’’ అని రాసుకొచ్చాడు.

Next Story