Vijay Deverakond: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. వావ్ నువ్వు సూపర్ అన్నా అంటున్న ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Vijay Deverakond: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. వావ్ నువ్వు సూపర్ అన్నా అంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో బ్రాండెడ్ బట్టలను సినీ సెలబ్రిటీలకు పంపుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.

తాజాగా, రౌడీ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఆయనకు విజయ్ రౌడీ బ్రాండ్ టీ షర్ట్, షటిల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియోను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్‌కు ‘‘ద మాయ్స్ మీట్.. ఇద్దరు ఎనర్జిటిక్ కుర్రాల్లు కలిసిన వేళ’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఎపిసోడ్-1 అని కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఓ బ్లాక్ కలర్ టీషర్ట్‌ను అనిరుధ్, విజయ్‌కు ఇచ్చాడు. ఇక అది చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అన్నా అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం ‘కింగ్‌డమ్’ అప్డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story