- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరాబర్ మా హీరో లూజ్ ప్యాంటే వేస్తాడు...బండ్ల గణేష్ కు కౌంటర్లు?
బండ్ల గణేష్ వాడడం విజయ్ దేవరకొండ అభిమానులకు కోపాన్ని తెప్పించింది. తమ హీరోను ఉద్దేశించే, నిర్మాత

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏది మాట్లాడినా ఇట్టే వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లకు హాజరవుతూ, తెగ సందడి చేస్తున్నారు బండ్ల గణేష్ (bandla ganesh). ఇందులో భాగంగానే కిరణ్ అబ్బవరం నటించిన K-Ramp సినిమా సక్సెస్ మీట్ కు స్పెషల్ గెస్ట్ గా నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బండ్ల గణేష్ వర్సెస్ విజయ్ దేవరకొండ అన్న రేంజ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ కూడా కొనసాగుతోంది.
ఈ ఈవెంట్ సందర్భంగా కిరణ్ అబ్బవరంను బండ్ల గణేష్ చాలా మెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పోల్చారు. అక్కడితో ఆగకుండా ఒక్క హిట్టు పడగానే లూజ్ ప్యాంట్ వేసుకొని వాట్సప్ అనే హీరోలు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం చాలా సింపుల్ గా ఉంటూ హిట్లు అందుకుంటున్నాడని వెల్లడించారు.
అయితే లూజ్ ప్యాంట్లు, వాట్సప్ వాట్సప్ అనే పదం బండ్ల గణేష్ వాడడం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులకు కోపాన్ని తెప్పించింది. తమ హీరోను ఉద్దేశించే, నిర్మాత బండ్ల గణేష్ రెచ్చిపోయి మాట్లాడాడని, విజయ్ దేవరకొండ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ ను ట్రోలింగ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. మా హీరో బరాబర్ లూజ్ ప్యాంట్లు వేస్తాడు.. త్వరలో హిట్టు కొడతాడు, చూసుకో బండ్ల గణేష్ అంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. క్లిక్






