ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసినందుకు చేసి చూపించా అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్

by Disha Web Desk 6 |
ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసినందుకు చేసి చూపించా అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2018 లో ‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవ్, ఫ్లాప్ అవ్వగా 2022లో వచ్చిన లైగర్ విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విజయ్, సమంతతో కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఈ చిత్రం నేడు సెప్టెంబర్1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ రౌడీ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్టును పెట్టాడు. ‘‘మీరందరూ ఐదు సంవత్సరాల నుంచి నాతో ఉన్నారు. నేను చేయాల్సిన పని కోసం ఎంతో ఓపికగా ఎదురు చూశారు. నేను ఈరోజు ఆ పనిని చేసేశాను. ఈ ఆనందంలో చాలా మంది వందల కొద్ది మేసేజ్‌లు చేస్తున్నారు. అందరికీ లవ్ యూ. ఈ సినిమాకు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయండి. నాకు తెలుసు మీరు వెళతారు. మీ విజయ్ దేవరకొండ’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


Read More: గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్?



Next Story

Most Viewed