'లైగర్' ఇండియాను షేక్ చేస్తుంది.. విజయ్ దేవరకొండ

by Disha Web Desk 7 |
లైగర్ ఇండియాను షేక్ చేస్తుంది.. విజయ్ దేవరకొండ
X

దిశ, సినిమా: రౌడీ‌ హీరో విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా వస్తున్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు హాజరైన హీరో హీరోయిన్లు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చి ప్రేక్షకులను అలరించారు. 'పెళ్లి చూపులు'తో హైదరాబాద్‌లో చిన్నగా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు 'లైగర్'తో ఇండియా గుర్తించే స్థాయికి ఎదిగిందని, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు విజయ్. అలాగే ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవడమే కాదు ఇండియాను షేక్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కూడా ఉందన్నాడు. ఇక ఈ సినిమాతో తన పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుందన్న ఆనన్య ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు పంచిన ప్రేమ ఎన్నటికీ మర్చిపోలేనని, తన మొదటి తెలుగు సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది.

మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మెగా డాటర్ సందడి


Next Story

Most Viewed