నెల్లూరు కుర్రాళ్లతో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇంటర్‌నెట్‌ను ఊపేస్తున్న వీడియో

by Disha Web Desk |
నెల్లూరు కుర్రాళ్లతో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇంటర్‌నెట్‌ను ఊపేస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు శ్రీలీల. పెళ్లి సందDతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకదశలో టాలీవుడ్‌లో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు శ్రీలీల తమ సినిమాలో ఉండాల్సిందే అంటూ దర్శకనిర్మాతల దగ్గర పట్టుబట్టినట్లు వార్తలు సైతం ఫిల్మ్ నగర్‌లో గుప్పుమన్నాయి. అంతలా మెస్మరైస్ చేసింది శ్రీలీల. అయితే ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుండటంతో శ్రీలీలపై ఐరన్ లెగ్ అనే ముద్రవేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒకేఒక్క సినిమా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న ఈ భామ.. ఆ తర్వాత ఏ ఒక్క కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. అయితే ఆమె అనూహ్యంగా కాలేజీ ఫెస్ట్‌లకు హాజరవుతూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇటీవల చెన్నైలోని ఓ కాలేజీ ఫెస్ట్‌కు వెళ్లి సందడి చేసిన శ్రీలీల.. తాజాగా నెల్లూరులోనూ తళుక్కుమన్నది. నెల్లూరులో ఓ ప్రైవేట్ కాలేజీ నిర్వహించిన ఫెస్ట్‌కు గెస్ట్‌గా హాజరైన శ్రీలీల అక్కడి స్టూడెంట్స్‌తో హంగామా చేసింది. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు కాలేజీ బాయ్స్‌తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ యంగ్ హీరోయిన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన స్టూడెంట్స్ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed