‘జిలేబి’ అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్: విక్టరీ వెంకటేష్

by Disha Web Desk 13 |
‘జిలేబి’ అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్: విక్టరీ వెంకటేష్
X

దిశ, సినిమా: శ్రీకమల్, కె. విజ‌య‌భాస్కర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘జిలేబి’. అంజు అశ్రాని సమర్పణలో ఎస్ఆర్కే బ్యానర్‌పై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టీజర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ మేరకు మాట్లాడిన ఆయన.. ‘ఇది నిజంగా స్వీట్ అకేషన్. ఈ మూవీ ‘జిలేబి’లాగే స్వీట్‌గా ఉంటుందని నా నమ్మకం. తప్పకుండా ఒక ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్ అవుతుంది. నటుడిగా పరిచయమవుతున్న కమల్‌తోపాటు శివాని రాజశేఖర్‌కు ఆల్ ది బెస్ట్. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది’ అన్నారు.

ఇక టీజర్ లాంచ్ చేసిన వెంకటేష్‌కు కృతజ్ఞతలు చెప్పిన దర్శకనిర్మాతలు.. అంతా ఒక కుటుంబంలా కలసి ఈ సినిమా చేశాం. అందరూ సినిమా చూసి మనసారా నవ్వుకుంటారని చెప్పారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ‘రామబాణం’ నుంచి ఫస్ట్ సింగిల్.. ఐఫోన్ లిరికల్ వీడియో రిలీజ్


Next Story