సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ కమెడియన్ కన్నుమూత

by Disha Web Desk 19 |
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ కమెడియన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: మళయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్ మముక్కోయా (76) బుధవారం కన్నుమూశారు. ఇటీవల కేరళలోని మలప్పురం జిల్లా వాండూర్‌లో ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మముక్కోయా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మాముక్కోయా తుది శ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్‌తోనే కమెడియన్ మముక్కోయా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మముక్కోయా మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక, 1970లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మముక్కోయా.. పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు.

Also Read:

అనాథ పిల్లలకు లావణ్య త్రిపాఠి చేయూత (ఫోటోస్ వైరల్)



Next Story

Most Viewed