Ram Gopal Varma: వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన తల్లి.. ఇక మారడంటూ

by samatah |   (  Updated:2022-12-17 14:32:11  IST  )

రామ్ గోపాల్‌వర్మ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో

Ram Gopal Varma: వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన తల్లి.. ఇక మారడంటూ
X

దిశ, సినిమా: రామ్ గోపాల్‌వర్మ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో కలిసి చేసే బోల్డ్ ఇంటర్వ్యూలలో రచ్చ చేస్తున్నాడు. దీంతో వర్మను విమర్శించే వారి సంఖ్య పెరిగింది. తాజాగా వర్మ తల్లి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. 'నేను 'GST' సినిమా రాము పక్కన కూర్చోని చూశాను. తను ఇతరుల ఇష్టాలను ఎంతో గౌరవిస్తాడు. వర్మ ఇంటికి వచ్చే సమయానికి నేను లేకపోతే తనకు నచ్చదు. ఇంటి రాగానే నేను తారసపడితే తన కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. ఇక తాను మారాలనుకున్నపుడే మారతాడు. ఎవ్వరు చెప్పిన వినడు. ఈ జన్మకు తానంతే' అని వర్మ తల్లి సూర్యమ్మ చెప్పుకొచ్చింది.

Next Story