Venkatesh చెంప చెల్లుమనిపించిన స్టార్ డైరెక్టర్

by Disha Web Desk |
Venkatesh చెంప చెల్లుమనిపించిన స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా:టాలీవుడ్ ఫ్యామిలీ హీరోస్‌లో విక్టరీ వెంకటేష్ ఒకరు.ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్, ఎమోషనల్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక సినిమా విషయం పక్కన పెడితే అంత పెద్ద హీరో అయినా వెంకీ చెంప చెల్లుమనిపించాడట ఓ డైరెక్టర్. అందరు చూస్తుండగానే షూటింగ్ స్పాట్‌లోనే కొట్టాడట. మరి వెంకటేష్‌ను కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు కొట్టాడో తెలుసా? వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బిలి రాజా’ సినిమాను ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. 1990లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలావరకు అడవిలో చిత్రీకరించారట డైరెక్టర్ బి గోపాల్.

అయితే అదే సమయంలో వెంకటేష్ ముఖంపై ఒక విషపు పురుగు పడిందట. ఆ పురుగును చూసిన దర్శకుడు గోపాల్ వెంకటేష్ చెంప చెల్లుమనిపించారట. కానీ పురుగు విషం తెలియక వెంకటేష్‌ను అలా ఎందుకు కొట్టారో కాసేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదట. దీంతో గోపాల్ ‘వెంకటేష్ నీ ఫేస్ మీద విషపు పురుగు ఉంది. అందుకే కొట్టాను. అది కరిస్తే చాలా ప్రమాదం’ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మూవీ టీం ఊపిరి పీల్చుకున్నారట.

ఇవి కూడా చదవండి : నటుడిపై దాడి చేసిన అభిమానులు.. సెల్ఫీ దిగాక ప్రతాపం చూపించారు..


Next Story

Most Viewed