కోలీవుడ్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ కమర్షియల్ మూవీ.. ఇదెక్కడి కాంబో రా మావా అంటూ షాక్‌లో నెటిజన్లు

by Mallepaka Hamsa |

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలతో ఉన్నాడు.

కోలీవుడ్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ కమర్షియల్ మూవీ.. ఇదెక్కడి కాంబో రా మావా అంటూ షాక్‌లో నెటిజన్లు
X

దిశ, సినిమా: వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలతో ఉన్నాడు. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’(Korean Kanakaraju) చిత్రంపై ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా కొరియన్ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే సీన్లు, తమన్ అందించిన భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వరుణ్ తేజ్ వైలెంట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. హారర్ కామెడీ జానర్‌లో సరికొత్త కొరియన్ టచ్‌తో వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం కోసం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలపబోతున్నారనే వార్త నెట్టింట సంచలనంగా మారింది.

'జవాన్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ(Atlee), వరుణ్ తేజ్ కోసం ఒక భారీ కమర్షియల్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ గురించి తెలిసిన నెటిజన్లు ‘ఇదెక్కడి మాస్ కాంబో మామా!’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగా, ఇందులో ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. రొటీన్ ఇండియన్ హారర్ కథలకు భిన్నంగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం వరుణ్ తేజ్‌ కెరీర్‌కు మైలురాయిగా మారుతుందని అంతా అనుకుంటున్నారు.

Next Story