లావణ్య కోసం స్వయంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్న వరుణ్ తేజ్.. ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
లావణ్య కోసం స్వయంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్న వరుణ్ తేజ్.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారని.. ఈ మేరకు జూన్-9 న వారి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారట. అతి తక్కువ మంది సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసి.. పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటంటే..

వరుణ్ గవ్వలు, పిజ్జా చేసుకుని తింటున్నట్లు ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోలో వరుణ్ పిజ్జా తింటూ.. గవ్వలు చేస్తూ చాలా కష్టపడుతున్నాడు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. లావణ్య వస్తున్న సందర్భంగా వరుణ్ గవ్వలు చేస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం.. ‘అన్న వదినకు వంటలు వచ్చో రావో.. నువ్వే చెయ్యాలి’, ‘మీ పెళ్లికి వెరైటీస్ ఇవేనా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read..

జూన్ 9కి హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్


Next Story

Most Viewed