ఆ లేడీ కారణంగా త్వరలోనే విడిపోబోతున్న వరుణ్ తేజ్, లావణ్! బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి

by Disha Web Desk 7 |
ఆ లేడీ కారణంగా త్వరలోనే విడిపోబోతున్న వరుణ్ తేజ్, లావణ్! బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అందరికి సుపరిచితమే. సినిమా సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఫుల్ టార్గెట్ చేసిన ఈయన.. వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. అంతే కాకుండా టాలీవుడ్‌లో పెళ్లైన కొందరు సెలబ్రెటీలు విడిపోతారని వివాదాస్పద కామెంట్స్ చేస్తారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన చెప్పినట్లే నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు ఈయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఈ మేరకు కొత్తగా పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న.. లావణ్య, వరుణ్ తేజ్ విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘మిస్టర్’ సినిమాతో ప్రేమలో పడ్డా వరుణ్ తేజ్, లావణ్య దాదాపు ఆరు ఏళ్లు ప్రేమించుకుని.. గతేడాది నవంబర్‌‌లో పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. వీరు జాతకంలో కలిసి ఉండే యోగం లేదని చెప్తున్నాడు వేణుస్వామి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల జాతకం ప్రకారం వారికి పెళ్లి యోగ్యం లేదు. కానీ పెళ్లి చేసుకున్నారు అంటే అది పెద్ద మిరాకిల్. ఎందుకంటే వాళ్లిద్దరి జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడు. వాళ్లు కలిసి ఉండే అవకాశం లేదు. నేను ఇలా చెబుతున్నానని.. నా మీద పడి ఏడుస్తూ విమర్శలు చేస్తారు. కానీ నేను జాతకం ప్రకారమే చెబుతానని. వ్యక్తిగతంగా తనకు వారితో గొడవ లేదు, బంధుత్వం లేదు. వీరిద్దరి ఫ్యామిలీలో ప్రముఖమైన ఓ లేడీ కారణంగా ఈ ఇద్దరి విడిపోతారు. ఇది కానీ కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ జరుగుతుంది’ అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. కాగా.. దాదాపు మూడు నెలల క్రితం ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు వేణుస్వామి.

Next Story

Most Viewed