- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఫస్ట్ క్రష్ సానియా మీర్జానే: వరుణ్ ధావన్
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ఫస్ట్ క్రష్‌పై ఓపెన్ అయ్యాడు.Latest Telugu News

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ఫస్ట్ క్రష్‌పై ఓపెన్ అయ్యాడు. త్వరలోనే 'భేడియా'తో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో.. సినిమాను ప్రమోట్ చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటరాక్షన్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై క్రష్ ఉన్నట్లు ఒప్పుకున్నాడు. తను మొదటిసారి ఓ ప్రొడక్షన్ హౌజ్ చిత్రీకరించిన ప్రకటనలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నానని, అయితే అదే యాడ్‌లో సానియా మీర్జా కూడా ఉందనే విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ షూటింగ్ సమయంలో సానియాను అలాగే చూస్తూ ఉండిపోయే వాడినన్న హీరో.. సానియా కోసం యాపిల్స్ తీసుకెళ్తుండగా వాళ్ల మమ్మీ అడ్డుకున్న ఘటన గురించి సరదాగా చెప్పుకొచ్చాడు. చివరగా ఆ ప్రకటన కోసం రూ. 5వేలు అందుకున్నట్లు వెల్లడించాడు వరుణ్.
Read More : 'అవతార్' డైరెక్టర్‌కు ప్రైవేట్ ఓటీటీ.. అదేంటో తెలుసా?






