- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కియారా బికినీ ఫోటోలపై వర్మ షాకింగ్ క్లారిటీ.. ఆ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఇదేనంటూ సెన్సేషనల్ కామెంట్స్
అందమైన మహిళలను చూసినప్పుడు నా మనసులో కలిగే భావాలను నేను ఎప్పుడూ దాచుకోను.

దిశ, సినిమా: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ (RGV), ఇటీవల ‘వార్-2’ టీజర్ విషయంలో తను ఎదుర్కొన్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తనదైన శైలిలో స్పందించారు. కియారా అద్వానీ(Kiara Advani) అందాన్ని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేయగా, వర్మ మాత్రం అది తను ఇచ్చిన ఒక రకమైన ప్రశంస అని సమర్థించుకున్నారు. ‘వార్-2’ టీజర్‌లో కియారా బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వర్మ ఒక దారుణమైన కామెంట్ చేశారు. ‘హృతిక్, ఎన్టీఆర్‌ల మధ్య యుద్ధం దేశాల కోసం కాకుండా, ఆమె అందాన్ని (శరీర భాగాలను ఉద్దేశించి) దక్కించుకోవడం కోసమైతే సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది’ అనే అర్థం వచ్చేలా పచ్చిగా రాశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో ఆయన ఆ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘అందమైన మహిళలను చూసినప్పుడు నా మనసులో కలిగే భావాలను నేను ఎప్పుడూ దాచుకోను. ఆ ట్వీట్‌ను ఒక 'బ్యాక్‌హ్యాండెడ్ కాంప్లిమెంట్' (వెరైటీగా పొగడటం)గా చూడాలి. ఒక అమ్మాయి బికినీ వేసుకుని ట్రైలర్‌లో కనిపిస్తోందంటే, అది ఏదో ఒక స్పందనను కలిగించడానికే కదా! నేను కూడా ఒక ప్రేక్షకునిగా నా ఫీలింగ్‌ను చెప్పాను’’ అని అన్నారు. అంతేకాకుండా, తాను రంగీలా సమయంలో శ్రీదేవి గురించి మాట్లాడినా, మరెవరి గురించి మాట్లాడినా తన పద్ధతి ఇలాగే ఉంటుందని, తన ఆలోచనలు తన సినిమా కంటే భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇక ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారన్న ప్రశ్నకు మాత్రం.. నిజం చెప్పాలంటే ఎందుకు డిలీట్ చేశానో నాకు గుర్తులేదు" అని దాటవేశారు. వర్మ మాటలు విన్న నెటిజన్లు ఈయన మారడు.. ఈయన లాజిక్కులు ఎవరికీ అర్థం కావు అంటూ మరోసారి సెటైర్లు వేస్తున్నారు.






