- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరసిద్ధి వినాయకుడికి మెుక్కులు చెల్లించుకున్న హీరో
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శుక్రవారం భక్తుల రద్దీతో కిటికిటలాడింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శుక్రవారం భక్తుల రద్దీతో కిటికిటలాడింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. ఇకపోతే ప్రముఖ సినీనటుడు సాయిధరమ్ తేజ స్వామివారిని దర్శించుకున్నారు. వరసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న హీరో సాయిధరమ్ తేజ్‌కు ఆలయ అధికారులు ఇన్‌స్పెక్టర్ బాబు, సురేశ్‌లు దగ్గర ఉండి స్వామి వారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు సాయిధరమ్ తేజ్‌ను మెగా అభిమానులు కలిసి సన్మానించారు. అనంతరం సెల్పీలు దిగారు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన బ్రో ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా బ్రో నుంచి సెకండ్ సింగిల్ జానవులే అప్‌డేట్ సైతం ఇచ్చేశారు. బ్రో సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరూపాక్ష మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హీరో సాయిధరమ్ తేజ్ మెుక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది.






