- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ ప్రకటించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. విలన్‌గా నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన మల్టీ టాలెంట్‌తో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇటీవల ‘మద గజ రాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఈ అమ్మడు దర్శకురాలిగా మారడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.
ఈమేరకు దోస డైరీస్ బ్యానర్‌ను తన చెల్లి పూజా శరత్ కుమార్‌తో కలిసి ప్రారంభించింది. ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ‘సరస్వతి’(Saraswati) అనే థ్రిల్లర్ చిత్రం రాబోతుంది. ఇక ఇందులో ‘తి’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలెట్ చేస్తూ ఆసక్తిని పెంచారు. ఇక ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), సీనియర్ హీరోయిన్ ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. వరలక్ష్మీ శరత్ కుమార్ ‘‘దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతీ మీ ముందుకు రాబోతుంది. దోస డైరీస్ ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు ఎప్పటికన్నా ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి’’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. దర్శకురాలిగా.. నిర్మాతగా రాణించాలని కోరుకుంటున్నారు.






