- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లోకి వనితా విజయ్ కుమార్ కూతురు ఎంట్రీ.. ‘అగధ’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల
కోలీవుడ్ వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక విజయ్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత, 'సంక్రాంతి' సినిమాల మొనగాడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘అగధ’ . ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఆయన, ఈసారి మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ జానర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. కోలీవుడ్ వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక విజయ్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే తన వ్యక్తిగత జీవితం, రియాలిటీ షోలతో వార్తల్లో నిలిచిన వనిత వారసురాలిగా జోవిక ఎంట్రీ ఇవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో ఆమె ‘హరిణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో జోవిక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని, వర్షంలో తడుస్తూ ఉగ్రరూపంలో కనిపిస్తోంది.
ఈ లుక్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా, కాస్త నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’గా, శ్రావణ్ రెడ్డి ‘సింహా’గా నటిస్తున్నారు. అలాగే ఉల్కా గుప్తా, షిజు అబ్దుల్ రషీద్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సాగే భారీ వీఎఫ్ఎక్స్ (VFX) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని ఎమ్మెస్ రాజు తెలిపారు. ఒక డివైన్ థ్రిల్లర్‌లో ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉండటం సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘అగధ’, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. రాకేష్ వెంకటాపురం ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎమ్మెస్ రాజు మార్కు మేకింగ్, కొత్త నటీనటుల ఎంట్రీ, డివైన్ ఎలిమెంట్స్ అన్నీ తోడవ్వడంతో ‘అగధ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.






