బోల్డ్ యాంగిల్స్‌లో అందాల ఆరబోత.. దేనికైనా సిద్ధమంటున్న బ్యూటీ!

by Disha Web Desk 6 |
బోల్డ్ యాంగిల్స్‌లో అందాల ఆరబోత.. దేనికైనా సిద్ధమంటున్న బ్యూటీ!
X

దిశ, సినిమా : ప్రముఖ మోడల్, నటి వాణీ భోజన్‌ హీరోయిన్ల స్కిన్ షోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా అరుణ్‌ విజయ్‌ సరసన ఆమె నటించిన 'తమిళ్‌ రాకర్స్' సినిమా ఆగస్టు 19న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. ఈ రోజుల్లో సినిమా అవకాశాలతోపాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఇంపార్టెంట్ అని అభిప్రాయపడింది. అభిమానులు కోరున్నట్లుగా తమ అందాలను సినిమాల్లో చూపించే చాన్స్ లేనపుడు నెట్టింట చూపించగలుగుతున్నామన్న నటి.. కాలానికి తగ్గట్టు ఆలోచనలు కూడా మారాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఈ క్రమంలోనే హాట్‌హాట్‌ ఫొటోషూట్‌ చేయాల్సి వస్తుందన్న వాణి.. తాను కూడా అందాల ఆరబోతకు సిద్ధమేనని, బోల్డ్ యాంగిల్స్ కేవలం బికినీలోనే కాదు చీరలోనూ చూపించొచ్చు అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. చివరగా పదహారేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానన్న బ్యూటీ.. వెంటనే బ్రేకప్‌ కూడా అయిపోయిందని, ఇప్పటికీ అనేక ప్రేమ లేఖలు వస్తున్నట్లు చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed