- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్.. మృణాల్‌పై పూల వర్షం కురిపించిన సిద్ధాంత్..
టాలీవుడ్ సీతమ్మ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం తన అద్భుతమైన నటనతోనే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లతోనూ వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ సీతమ్మ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం తన అద్భుతమైన నటనతోనే కాకుండా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లతోనూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా వాలెంటైన్స్ వీక్ కావడంతో, బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది(Siddhanth Chaturvedi) ఆమెకు ఇచ్చిన ఒక సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొడుగులో గులాబీ రేకులను నింపుకుని వచ్చి, ఆమెపై ‘పూల వర్షం’ కురిపించిన వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్‌గా అలా చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా.. మృణాల్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన ‘దో దీవానే సేహర్ మేన్’ (Do Deewane Seher Mein) చిత్రం ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధంగా ఉంది. సంజయ్ లీలా భన్సాలీ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ జంట ఒక ఈవెంట్‌లో పాల్గొంది.
అప్పుడే సిద్ధాంత్ చేసిన ఈ రొమాంటిక్ పనికి మృణాల్ ఎంతో ఎగ్జైట్ అయ్యి, అతన్ని ఆత్మీయంగా హగ్ చేసుకుంది. గత కొన్నాళ్లుగా మృణాల్, కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రేమలో ఉన్నారని, ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, మృణాల్ వాటిని కొట్టిపారేసింది. ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని మృణాల్ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు సిద్ధాంత్‌తో కలిసి ఆమె చేస్తున్న సందడి చూస్తుంటే, అవన్నీ కేవలం సినిమా ప్రమోషన్ల కోసమేనా లేక డేటింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. రవి ఉద్యావర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.






