‘Adikesava’ రిలీజ్ అప్‌డేట్.. వైరల్ అవుతున్న రొమాంటిక్ లుక్స్

by Dishaweb |
‘Adikesava’ రిలీజ్ అప్‌డేట్.. వైరల్ అవుతున్న రొమాంటిక్ లుక్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనున్న సినిమా డేట్ ఫైనల్ చేస్తూ.. ‘కొన్ని విలువైన కథల కోసం నిరీక్షించే సమయం. నవంబర్ 10న ‘ఆది కేశవ’ విడుదల’ అంటూ మేకర్స్ నెట్టింట నయా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు రెండు మొఖాలు ఒకే దగ్గర పెట్టి రొమాంటిక్‌గా చూసుకుంటూ కనిపించగా వారి లుక్ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది.

ఇక గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో ‘రేయ్ రాముడు లంక మీద ప‌డ‌టం ఇనుంటావ్‌. అదే ప‌ది త‌ల‌కాయ‌లు ఊడి అయోధ్య మీద ప‌డితే ఎట్టుంటాదో చూస్తావా’ అని విల‌న్ అంటుంటే ‘ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాద‌ప్ప. ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు. త‌ల‌లు కోసి చేతికిస్తా నా యాళ’అంటూ వైష్ణవ్ చెప్పే డైలాగ్ పూనకాలు తెప్పిస్తోంది. చివరగా ‘మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదు’ అని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి చెబుతుండగా.. వైష్ణవ్‌ తేజ్‌ రౌడీలను రఫ్పాడించే యాక్షన్‌ సీన్స్ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

Next Story

Most Viewed