‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్.. అందరినీ గర్వపడేలా చేస్తాను: మహేష్ బాబు

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-16 09:24:29  IST  )

మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’.

‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్.. అందరినీ గర్వపడేలా చేస్తాను: మహేష్ బాబు
X

దిశ, సినిమా: మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఇతర పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. మహేష్ బాబు ఫస్ట్ లుక్ కోసం అభిమానులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, మూవీ మేకర్స్ అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అంచనాలను పెంచారు. ‘వారణాసి’ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మహేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘‘నాన్న గారు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతీ మాట వినేవాడిని. ఆయన ఎప్పుడూ నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగే వారు. నువ్వు అలాంటి గెటప్స్‌లో చాలా బాగుంటావు అని చెప్పేవారు. కానీ ఆయన మాట నేను వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయిని నమ్ముతున్నాను. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను.అందరినీ గర్వపడేలా చేస్తాను. ‘వారణాసి’ రిలీజ్ అయినప్పుడు యావత్ దేశం మన గురించి గర్వంగా ఫీల్ అవుతుంది. ఇది టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా’’ అని అన్నారు.

READ MORE ....

అప్డేట్ అన్నారుగా..ఇక‌పై చొక్కా తీసేసి వస్తా..మ‌హేష్ బాబు సూప‌ర్ స్పీచ్‌

Next Story