ఆ రోజే ఐశ్వర్య నడుము చూసి షాక్ అయ్యాను.. ఆమె జీన్స్ తొడిగి చూసుకుంటే..

by Dishanational2 |
ఆ రోజే ఐశ్వర్య నడుము చూసి షాక్ అయ్యాను.. ఆమె జీన్స్ తొడిగి చూసుకుంటే..
X

దిశ, సినిమా:స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ నడుము కొలతలు తెలుసుకునేందుకు తాను చేసిన ఓ సరదా పనిని అభిమానులతో షేర్ చేసుకుంది ప్రముఖ నటి స్వస్తికా ముఖర్జీ. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘చోఖేర్ బాలి’ నవల ఆధారంగా 2003లో వచ్చిన భారతీయ బెంగాలీ భాషా చిత్రానికి రితుపర్ణో ఘోష్ దర్శకత్వం వహించగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా కోసం పనిచేసిన స్వస్తిక.. మూవీ షూటింగ్‌లో ఐశర్య నడుము చూసి షాక్ అయ్యానని, అలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది. ‘ఒకసారి సెట్‌లో ఉన్నప్పుడు ఐశ్వర్య జీన్స్‌ సైజు నా నడుముకు చూసుకునేందుకు వెళ్లాను. నిజానికి ఆమె అంత సన్నగా ఉంటుందని అప్పటిదాకా తెలియదు. ఎందుకంటే దాన్ని కవర్ చేసుకునేందుకు ఆమె అడల్ట్ టైప్ బట్టలు ధరిస్తుందని తెలిసి నమ్మలేకపోయా’ అని చెప్పింది. అయితే ఐశ్వర్య కంటే తన నడుము కేవలం 2 అంగుళాలు పెద్దదిగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలిపింది.

Read More: ఆర్య సమాజ్‌లో పెళ్లి కోసం పేర్లు మార్చుకున్న షారుఖ్-గౌరి.. నెటిజన్లు ఫిదా



Next Story

Most Viewed