‘మోస్ట్ సెక్సీయెస్ట్’.. రిషబ్ లవర్‌పై కన్నేసిన జడేజా

by Disha Web Desk 9 |
‘మోస్ట్ సెక్సీయెస్ట్’.. రిషబ్ లవర్‌పై కన్నేసిన జడేజా
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల అందంపై ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ రూమర్ గర్ల్ ఫ్రెండ్‌గా పేరుగాంచిన నటి తరచూ వార్తల్లో నిలుస్తుండగా.. జడేజా చేసిన వ్యాఖ్యల కారణంగా మరోసారి తన పేరు హాట్ టాపిక్‌గా మారింది. విషయానికొస్తే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జడ్డూను ‘బాలీవుడ్‌లో మీకు మోస్ట్ సెక్సీయెస్ట్‌ యాక్ట్రెస్‌గా ఎవరు కనిపిస్తారు? అని ప్రశ్నించారు.

దీనికి వెంటనే ఆన్సర్ చేసిన ఆయన.. ‘ఊర్వశి తన అద్భుతమైన రూపంతోనే భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది. పరిశ్రమలో చాలా మంది ఆమె అందాన్ని ప్రశంసించారు. ఆమె ప్రతిభ, గ్లామర్ కోసం అభిమానులు ఫిదా అయ్యారు. రవీంద్ర జడేజా కూడా దీనికి మినహాయింపు కాదు’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టాడు. ప్రస్తుతం జడేజా కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

Read More: ‘#Nani 30’లో కొణిదెల నిహారిక గెస్ట్ రోల్?




Next Story