- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృణాల్-బిపాసా వివాదంపై స్పందించిన ఉర్ఫీ జావెద్.. నా మీద నాకు అసహ్యం వేస్తుందంటూ షాకింగ్ పోస్ట్
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అమ్మడు తన నటన, అందంతో క్రేజ్‌ను రాబట్టుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా మృణాల్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ వివాదాస్పదంగా మారింది. గతంలో ఆమె బిపాసా బసు(Bipasha Basu) కంటే అందంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయడంతో స్పందించి క్లారిటీ ఇచ్చింది. తెలివి తక్కువగా మాట్లాడానని.. అవి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని నాకు తెలియదని తెలిపింది. అంతేకాకుండా అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
అయినప్పటికీ మృణాల్‌పై ట్రోల్స్ ఆగడం లేదు. తాజాగా, ఈ వివాదంపై హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాలో మృణాల్ వీడియోను షేర్ చేస్తూ ‘‘మనం యువకులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో అంతగా తెలియదు. ప్రతిరోజూ మనం నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉంటాం. గతంలో మనం మాట్లాడిన విషయాలతో ఇప్పుడు మనం ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంతో కొంత అయినా మారతాం. మన ఆలోచనలు, నైతిక విలువలు కూడా మారతాయి. నేను కూడా గతంలో ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడాను. వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






