- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ న్యూస్ : వెయ్యి కోట్లకు ‘వారణాసి’ ఓటీటీ డీల్
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బాక్సాఫీస్‌ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాడు. హాలీవుడ్ మేకర్స్ ఇండియన్ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసేలా అటెన్షన్ క్రియేట్ చేశాడు.

దిశ, సినిమా : ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బాక్సాఫీస్‌ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాడు. హాలీవుడ్ మేకర్స్ ఇండియన్ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసేలా అటెన్షన్ క్రియేట్ చేశాడు. హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఆయన టేకింగ్‌కు సలామ్ చేయగా.. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ‘వారణాసి’తో తన స్టామినాను చూపించేందుకు సమాయత్తమవుతున్నాడు. జస్ట్ టైటిల్ లాంచ్, గ్లింప్స్‌తోనే సినిమాపై మస్త్ హైప్ క్రియేట్ చేయగలిగిన జక్కన్న.. బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే కాదు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌లోనూ రికార్డ్ షేక్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్.. ‘వారణాసి’ మూవీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీ టాక్.
తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌లో దుమ్ము లేపుతోంది. ఇందుకు కారణం ఒక విధంగా రాజమౌళి అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆయన మరో రికార్డ్ సెట్ చేశాడు. జక్కన్న అప్‌కమింగ్ మూవీ ‘వారణాసి’ ఓటీటీ రైట్స్‌కు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వెయ్యి కోట్లు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ రూ. 650 కోట్లు ఆఫర్ చేయగా.. డీల్ రిజెక్ట్ చేసిన జక్కన్న అండ్ టీమ్ రూ. 1000 కోట్ల టార్గెట్ పెట్టినట్లు సమాచారం. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరో రెండు ప్లాట్‌ఫామ్స్ బిడ్డింగ్‌లో ఉన్నాయని టాక్. దేశీ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ చిత్రంలో 72,000 BC నుంచి 2071 AD వరకు టైమ్ ట్రావెల్, రామాయణ-మహాభారత ఎపిక్ ఎలిమెంట్స్ మూవీపై హైప్ పెంచగలిగాయి.






