బేబీ బంప్‌పై మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Disha Web Desk 6 |
బేబీ బంప్‌పై మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..!
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దుబాయ్‌కు వెళ్లి అక్కడే సీమంత వేడుక జరుపుకున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు పెగుతోంది. తాజాగా, ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఉపాసన తన బెబీ బంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రెగ్నెన్సీ ఓ వేడుకలా ఉండాలని కోరుకుంటా. ప్రస్తుతం ఈ జర్నీని ఆస్వాదిస్తున్నాను. అందుకే ప్రపంచ దేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టేసి వచ్చాను. నా ఫుడ్, పోషకాహారం గురించి డాక్టర్ సలహాలు ఇచ్చారు. నార్మల్ దుస్తుల్లోనే నేను ఫిట్‌గా ఉన్నా. అందుకే ప్రత్యేకంగా మెటర్నిటీ క్లాత్స్ ధరించడం లేదు. నార్మల్ దుస్తుల్లో కనిపించడాన్ని గొప్పగా భావిస్తున్నా. నిజానికి ఇదొక గొప్ప ప్రయాణం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More:

స్కిన్ కలర్, బాడీ కొలతలుంటే సరిపోదు.. అది కూడా ఉండాలి

సెక్సీ డ్రెస్ వేసుకునే సల్మాన్‌తో తిరిగా.. పాలక్‌కు షెహనాజ్ కౌంటర్

Next Story

Most Viewed