కంగ్రాట్స్ మామయ్యా.. చిరుకు అభినందనలు తెలిపిన మెగా కోడలు

by Disha Web Desk 8 |
కంగ్రాట్స్ మామయ్యా.. చిరుకు అభినందనలు తెలిపిన మెగా కోడలు
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతే కాకుండా ఎంతో మందికి చిరంజీవి ఆదర్శం. అలాంటి హీరోకు మంచి గౌరవం దక్కింది.

తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ ప్రకటించింది. ఈ అవార్డుల లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవికి స్థానం దక్కింది. గతంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వరించగా, ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిరుకు రాజకీయ ప్రముఖులు, సినీనటులు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే మెగా కోడలు ఉపాసన చిరుకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపింది.

పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న వారి లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరంజీవి పేరును రౌండ్ చేసి కంగ్రాట్స్ మామయ్య అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story