అప్పటి వరకు ఊహిస్తూ ఉండండి.. ‘డ్యూడ్’ సినిమా అప్డేట్ విషయంలో ట్విస్ట్ ఇస్తూ మేకర్స్ షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘కోమలి’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు.

అప్పటి వరకు ఊహిస్తూ ఉండండి.. ‘డ్యూడ్’ సినిమా అప్డేట్ విషయంలో ట్విస్ట్ ఇస్తూ మేకర్స్ షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘కోమలి’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత ‘లవ్ టుడే’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల ‘డ్రాగన్’ మూవీతో వచ్చి ఘన విజయం సాధించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకోవడంతో ప్రదీప్ రేంజ్ మారిపోయింది. అతి తక్కువ సినిమాలతో ప్రదీప్ ఊహించని ఫేమ్‌తో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రజెంట్ ప్రదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’(Dude). యాక్షన్ కామేడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మమిత బైజు (Mamita Baiju)హీరోయిన్‌గా నటిస్తుండగా.. శరత్ కుమార్, హృధు హరూన్, రోహిణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

‘డ్యూడ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ఒక్క ట్వీట్‌తో ట్విస్ట్ ఇచ్చారు. ‘డ్యూడ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ సెప్టెంబర్ 18న సాయంత్రం 4:35గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే అప్పటి వరకు ఆ రెండు వార్తలను ఊహిస్తూ ఉండండి అనే క్యాప్షన్ జత చేశారు. ఒక ప్రదీప్ రంగనాథన్ తమిళంలో పాటపై క్లూ ఇస్తూ రెండు పదాలు గెస్ చేయాలని పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పాటపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

link

Next Story