- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2025 వరకూ Samanthaకు కష్టాలు తప్పవు: వేణు స్వామి
ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకుండా సామ్ ఇంట్లోనే ఉంటుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సమంత. అయితే రీసెంట్‌గా ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. ఇక ఈ వ్యాధి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సామ్ కూడా ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకుండా సామ్ ఇంట్లోనే ఉంటుంది. అయితే తాజాగా ఎప్పుడూ సెలబ్రిటీలపై జాతకాలు చెప్పే వేణు స్వామి సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఇప్పటికే ఆయన చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం 'సమంతకి వచ్చిన ఈ వ్యాధి ప్రమాదకరం ఏమీ కాదు. కానీ, 2025 నాటికి సమంత అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. ఇక సమంత అనారోగ్యంపై ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.






