మరింత రంజుగా పవన్-బాలయ్య ఎపిసోడ్-2 (వీడియో)

by Disha Web |
మరింత రంజుగా పవన్-బాలయ్య ఎపిసోడ్-2 (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ల సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే, వీరిద్దరినీ ఒకే వేదికమీద చూడాలని ఎప్పటినుంచో భావిస్తున్న అభిమానులకు 'ఆహా' అన్‌స్టాపబుల్ షోతో ఆ కల నిజమైంది. ఇప్పటికే విడుదలైన పార్ట్-1 ఎపిసోడ్‌ బుల్లితెర రికార్డులను తిరగరాసింది. తాజాగా.. పార్ట్‌-2 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్లు విడుదల చేశారు. ఈ ఎపిసోడ్‌లో రాజకీయాలకు సంబంధించిన అంశాలను కీలకంగా ప్రస్తావించారు. మధ్యలో డైరెక్టర్ క్రిష్ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మరింత సంతోషాన్నిచ్చింది.
Next Story