‘Jawan’లో దీపిక ఎపిసోడ్‌కు స్పెషల్ అప్లాజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్..

by Disha Web Desk 7 |
‘Jawan’లో దీపిక ఎపిసోడ్‌కు స్పెషల్ అప్లాజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్..
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా టికెట్ బుకింగ్స్‌‌తో భారీ బిజినెస్ చేసిన సినిమా చూసిన రివ్యూయర్స్ బొమ్మ బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన క్రిటిక్ ఉమైర్ సంధు.. దీపికా పదుకొణే కామియో రోల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మూవీలో ఆమెకు సంబంధించిన పోర్షన్ అదిరిపోతుందని.. ముఖ్యంగా ఫ్యాన్స్‌ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. దీపిక స్పెషల్ అప్పియరెన్స్‌తో మజా వచ్చిందన్న ఉమైర్.. సినిమాలో స్టన్నింగ్‌గా ఉంటుందని తెలిపాడు. మొత్తానికి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంపై సంతోషిస్తున్న అభిమానులు.. బ్రిలియంట్ యాక్ట్రెస్‌కు అప్లాజ్ దక్కాల్సిందే అంటున్నారు.

ఇవి కూడా చదవండి : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..


Next Story

Most Viewed