- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెస్బియన్ జంటగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఇదేం దరిద్రమంటూ నెటిజన్ల కామెంట్స్!
ఇందులో వీరిద్దరూ మామూలు స్నేహితులు కాదు, ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకునే లెస్బియన్ జంటగా కనిపించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna)ఇప్పుడు ఒక సాహసోపేతమైన, వివాదాస్పదమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ తరహాలో బోల్డ్ కంటెంట్ ఉన్న కథను ఎంచుకోవడమే ఇప్పుడు ఆమెను ట్రోల్స్‌కు గురిచేస్తోంది. హోమీ అదిజానియా దర్శకత్వంలో రాబోతున్న ‘కాక్‌టెయిల్-2’(Cocktail-2) లో రష్మిక, కృతి సనన్(Kriti Sanon) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో వీరిద్దరూ మామూలు స్నేహితులు కాదు, ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకునే లెస్బియన్ జంటగా కనిపించబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే, ఈ సీక్వెల్ మాత్రం స్వలింగ సంపర్కం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథ అని ప్రచారం జరుగుతోంది. షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి రష్మిక మందన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంత దిగజారాలా?
భారతీయ సంస్కృతిలో ఇలాంటి రిలేషన్స్ చూపించడం వల్ల యువత తప్పుదారి పడుతుంది. రష్మిక వంటి స్టార్ ఇలాంటి రోల్ ఒప్పుకోవడం విచారకరం అని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి దరిద్రపు పాత్రలు అవసరమా? పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా? అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌కి వెళ్ళాక రష్మిక ఇలాంటి సంచలన డెసిషన్స్ తీసుకోవడం ఆమె కెరీర్‌కు మైనస్ అవుతుందేమోనని తెలుగు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా పూర్తయిందని, త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి అందరికీ షాక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. రష్మిక, కృతి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సినిమాలో మేజర్ హైలైట్ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి.






