- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన స్టార్ హీరో భార్య.. ప్రధాని రిషి సునాక్‌తో స్పెషల్ ఫొటో వైరల్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు. ఈ మేరకు ఇటీవలే లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ట్వింకిల్ ఖన్నా అక్కడ తన భర్త అక్షయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధానిని మీట్ అయినట్లు చెబుతూ ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను ట్వింకిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ముందుగా ఇటాలియన్ సింగర్ ఆండ్రియా బోసెల్లి ప్రదర్శన ఇస్తూ కనిపించగా.. వీడియో చివర్లో అక్షయ్, ట్వింకిల్ ఖన్నా, రిషి సునాక్ ఫొటోకు పోజులిస్తూ కనిపించారు. అంతేకాదు రిషి సునాక్‌తో కలిసి నవ్వుతూ దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ట్వింకిల్ ‘Very cool meeting’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






