‘టక్కర్’ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది: దర్శకుడు కార్తీక్

by Disha Web Desk 9 |
‘టక్కర్’ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది: దర్శకుడు కార్తీక్
X

దిశ, సినిమా: చార్మింగ్ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా వస్తున్న మూవీ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా జూన్ 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బొమ్మరిల్లు భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేష్, సురేష్ బాబు అతిథులుగా వచ్చారు. ఈ మేరకు మూవీ టీమ్‌లో చాలామంది తనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని, మూవీ తప్పకుండా హిట్ అవుతుందని సురేష్ బాబు చెప్పాడు. అలాగే ఈ జనరేషన్‌కు సిద్ధార్థ్ కమల్ హాసన్ లాంటివాడని తరుణ్ భాస్కర్ పొగిడేయగా యూనివర్సల్ కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్ముతున్నట్లు కార్తీక్ తెలిపాడు. చివరగా తదితరులు మాట్లాడుతూ ఈ సినిమాతో నటీనటులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని, ప్రేక్షకులు ఆదరించి బిగ్ చేయాలని కోరారు.

Also Read: దానికంటే తెలుగు తమిళ చిత్రాల్లో నటించడం బెటర్ : షాహిద్ కపూర్

Next Story

Most Viewed