నందమూరి హీరోపై ట్రోలింగ్... యాక్టింగ్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ అంటూ?

by velandi.Saikiran |

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పై ( Nandamuri Kalyan Ram) దారుణంగా ట్రోల్లింగ్.. చేస్తున్నారు. సీనియర్

నందమూరి హీరోపై ట్రోలింగ్... యాక్టింగ్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ అంటూ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పై ( Nandamuri Kalyan Ram) దారుణంగా ట్రోల్లింగ్.. చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతితో ( Vijayashanthi ) టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి కనిపించారు. అర్జున్ సనాఫ్ వైజయంతి ( Arjun Son Of Vyjayanthi) సినిమా ప్రమోషన్ లో భాగంగా... విజయ శాంతి అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి... హైదరాబాదులోని ఓ థియేటర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ వీడియోలో.. విజయశాంతి చేతి పట్టుకొని.. ఓ కొడుకులాగా కళ్యాణ్ రామ్ నడిచాడు. అయితే అలా నడిచిన కళ్యాణ్ రామ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. సినిమాలో యాక్టింగ్ చేయాలి... కానీ.. ఇలా బయట కాదు... ఎందుకు ఓవర్ ఆక్టింగ్ చేస్తున్నావ్? అంటూ.. ఈ వీడియో కింద దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది. కళ్యాణ్ రామ్ ది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ కూడా సెటైర్లు పేల్చుతున్నారు.

దీంతో ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. అయితే వీటిపై నందమూరి అభిమానులు ( Nandamuri fans) మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా హీరో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా చేసిన సినిమా... అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ చేస్తుండగా ప్రత్యేక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సయి మంజ్రేకర్ పనిచేస్తున్నారు. మే చివర లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించారు కళ్యాణ్ రామ్ అలాగే విజయశాంతి.


Next Story