42 ఏళ్ళ హీరోయిన్ తో త్రివిక్రమ్ భారీ ప్లాన్ !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్న వారిలో విక్టరీ వెంకటేష్ ( VENKATESH). తన పేరులోనే విక్టరీని

42 ఏళ్ళ హీరోయిన్ తో త్రివిక్రమ్ భారీ ప్లాన్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్న వారిలో విక్టరీ వెంకటేష్ ( VENKATESH). తన పేరులోనే విక్టరీని పెట్టుకున్న వెంకటేష్... సినిమా చేశాడంటే... మినిమం గ్యారంటీ హిట్ కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు విక్టరీ వెంకటేష్.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుంటున్నాడు వెంకటేష్. అంతేకాదు తన తర్వాతి ప్రాజెక్టు త్రివిక్రమ్ తో తీయబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా త్రివిక్రమ్ ( Trivikram) సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు.

అయితే... ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ముగ్గురు హీరోయిన్ల పేర్లను కూడా.. పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్. అందులో నిధి అగర్వాల్, త్రిష (Trisha ), రుక్మిణి వసంత్ పేరు పరిశీలనలో ఉన్నాయట. అయితే ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా ఉంటుందని కూడా అంటున్నారు. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. మరి ఈ ముగ్గురు హీరోయిన్లలో త్రివిక్రమ్ ఏ ఇద్దరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

Next Story