Trisha: స్టార్‌ హీరో ప్రేమలో మునిగిపోయిన త్రిష.. పోస్ట్‌తో అందరికీ బిగ్ షాకిచ్చేసిందిగా.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ త్రిష (Trisha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Trisha: స్టార్‌ హీరో ప్రేమలో మునిగిపోయిన త్రిష.. పోస్ట్‌తో అందరికీ బిగ్ షాకిచ్చేసిందిగా.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ త్రిష (Trisha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొట్టమొదని సినిమానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)తో చేసింది. ఇక ఈ చిత్రం హిట్ కావడంతో అమ్మడుకి ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్, స్టార్స్ నటించి మెప్పించింది. అతి తక్కువ కాలంలోనే తన నటన, అందంలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్న త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఏడాదిలో ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. 42 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన ‘విశ్వంభర’(Vishvambhara) చిత్రంలో నటిస్తోంది.

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అషికా రంగనాథ్(Ashika Ranganath) కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. ఇక త్రిష పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌జ(Thalapathy Vijay)తో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ అమ్మడు స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఇటీవల ఆయన పుట్టిన రోజు కావడంతో ఓ స్పెషల్ పోస్ట్‌ను కూడా పెట్టింది.

అలాగే అదే ఫొటోను ఆమె తల్లి కూడా షేర్ చేసి హార్ట్ ఎమోజీలు పెట్టడంతో ప్రేమ వార్తలు నిజమేనని అంతా నమ్మడం మొదలెట్టారు. నెట్టింట పలు రకాల చర్చలు మొదలయ్యాయి. ఈక్రమంలో.. తాజాగా, త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రేమపై పోస్ట్ పెట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొందరిని తిగమక చేస్తుంది’’ అనే కొటేషన్ షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు విజయ్‌తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి త్రిష 42 ఏళ్లకు పెళ్లి చేసుకోబోతుందని కొందరు త్రిష పోస్ట్‌రు రీ షేర్ చేస్తూ కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు.

Next Story