Pawan kalyan : పవన్ కళ్యాణ్‌తో మరోసారి జతకట్టనున్న త్రిష

by Disha Web Desk 10 |
Pawan kalyan : పవన్ కళ్యాణ్‌తో మరోసారి జతకట్టనున్న త్రిష
X

దిశ, సినిమా: పవన్‌ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆల్రెడీ ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నప్పటికీ.. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీకి అదనపు గ్లామర్ యాడ్ చేయడానికి సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. రీసెంట్‌గా ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత త్రిష ఇమేజ్ బాగా పెరగ్గా.. ఆ ఇమేజ్‌ని ‘హరి హర వీరమల్లు’కి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Read more:

యాక్టింగ్ గురించి ఎవ్వరికీ తెలియదంటూ ట్రోలర్స్‌పై ఫైర్ అయిన Nidhhi Agerwal



Next Story

Most Viewed