యాక్టింగ్ గురించి ఎవ్వరికీ తెలియదంటూ ట్రోలర్స్‌పై ఫైర్ అయిన Nidhhi Agerwal

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-30 11:02:18  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కినేని హీరో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

యాక్టింగ్ గురించి ఎవ్వరికీ తెలియదంటూ ట్రోలర్స్‌పై ఫైర్ అయిన Nidhhi Agerwal
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కినేని హీరో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్ అందుకుని ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇటీవల నిధి అగర్వాల్‌పై ‘ఒక్క హిట్ కూడా అందుకోకపోవడం ఆమె బ్యాడ్ లక్’ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. తాజాగా, దీనిపై నిధి అగర్వాల్ స్పందించింది. ‘‘ నటన విషయంలో నాకే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరు. నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియవు. నా నటనకు మెరుగులు దిద్దకుంటున్నాను. ఇకపై మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటించాలని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story