- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలకు గుడ్ బై చెప్పడంపై స్పందించిన త్రిష.. కోటీశ్వరుడితో పెళ్లి అంటూ సంచలన పోస్ట్!
త్రిష తన రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లపై చాలా ఘాటుగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గాసిప్ రాయుళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

దిశ, సినిమా: గత కొద్దికాలంగా సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంపై నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్న త్రిష సినిమాలకు దూరం అవుతుందన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ఒ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ త్రిష సినీ కెరీర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారాయి. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందని, ఇకపై కొత్త అవకాశాలను కూడా ఆమె ఒప్పుకోవడం లేదని కొందరు నిర్మాతలు తనకు చెప్పారంటూ ఆయన బాంబు పేల్చారు. ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న త్రిష ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో,తాజాగా, త్రిష తన రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లపై చాలా ఘాటుగా స్పందించింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గాసిప్ రాయుళ్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. "నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేశానంట.. ఒక కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్నానంట.. నాకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారంట.. వాళ్లకు నిన్ననే రెండో పుట్టినరోజు కూడా అయిపోయిందంట. ఇంకా ఏమైనా అబద్ధాలు మిగిలి ఉన్నాయా? లేక ఈ రోజుకి ఈ కల్పిత గాథల కోటా పూర్తయిందా?" అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. తన పర్సనల్ లైఫ్ మీద ఇష్టం వచ్చినట్టు కథలు అల్లవద్దని త్రిష ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ రూమర్లన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. నిజానికి త్రిష కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆమె ఇప్పుడప్పుడే సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’తో పాటు, సూర్య సరసన ‘కరుపు’, అలాగే డిసెంబర్ 19న రాబోతున్న ‘ద్వితీవ’ వంటి పవర్‌ఫుల్ ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. వరుసగా అన్ని భాషల్లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్న త్రిష, ఇలా తనపై వస్తున్న పుకార్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడినట్లయింది






