రౌడీ హీరో సినిమాలో ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్.. ఇక కెవ్వుకేకేనంట?

by Disha Web Desk 8 |
రౌడీ హీరో సినిమాలో ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్.. ఇక కెవ్వుకేకేనంట?
X

దిశ, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ హీరో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అంతే కాకుండా యూత్‌లో మంచి క్రేజీ సంపాదించుకున్నాడు.

ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన లైగర్ మూవీ విజయ్‌కి ఊహించని షాకిచ్చిన తర్వాత ఈ హీరో సినిమాల విషయంలో కాస్త ఆచీ తూచీ అడుగు వేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సమంతతో చేసిన ఖుషి మూవీ ఓకే అనిపించింది. దీంతో లైగర్ హీరో తర్వాత ప్రాజెక్టులపై చాలా క్వాలిటీ మెటైన్ చేస్తున్నాడంట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో విజయ్‌కు జోడీగా మృణాల్ నటిస్తోంది. కాగా, దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌‌గా మారింది.

రౌడీ హీరో మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ త్రిష నటించనున్నదంట. అంతే కాకుండా త్రిష నటించే పాత్ర సినిమాను హైలెట్‌గా మార్చబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇది చూసిన కొందరు నెటిజన్స్ విజయ్ దేవరకొండ పక్కన త్రిష ఇక కెవ్వు కేకే.. సూపర్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story