- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపై త్రిష క్లారిటీ...హనీమూన్ డేట్ ఫిక్స్ చేయండి అంటూ..!
ఓ బిజినెస్ మ్యాన్ ను త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతమంది వార్తలు వైరల్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె వయసు 42 సంవత్సరాలు వచ్చినప్పటికీ, హీరోయిన్ గా అవకాశాలు తగ్గించుకుంటున్నారు త్రిష. అయితే అలాంటి త్రిష పెళ్లిపై అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా చండీగఢ్ కు సంబంధించిన ఓ బిజినెస్ మ్యాన్ ను త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతమంది వార్తలు వైరల్ చేశారు. ఎంగేజ్మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ప్రచారం చేశారు. అయితే దీనిపై తాజాగా హీరోయిన్ త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెళ్లి కాదు డైరెక్టర్ హనీమూన్ షెడ్యూల్ ఫిక్స్ చేసేయండి అంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకోసం తన జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వాళ్లందరినీ నేను ప్రేమిస్తా, తనకోసం ఆరాటపడుతున్న వాళ్లు నా హనీమూన్ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు త్రిష. ఈ ఒక్క పోస్టుతో ఆమె పెళ్లి చేసుకోవడం లేదని తేలిపోయింది.






