- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Triptii Dimri: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన 'యానిమల్' హాట్ బ్యూటీ ?
ముంబై విమానాశ్రయంలో హీరోయిన్ తృప్తి డిమ్రిని డ్రాప్ చేసేందుకు.. ఆమె ప్రియుడు శ్యామ్ మర్చంట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో

దిశ, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇందులో కొంత మంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో అందాల తార తృప్తి డిమ్రి ( Triptii Dimri ) ఒకరు. యానిమల్ సినిమాతో... అందరినీ ఆకట్టుకున్న తృప్తి డిమ్రి... ఆ సినిమాలో బోల్డ్ గా నటించింది. హీరో సరసన ఎవరు చేయలేని సీన్లు కూడా చేసేసింది. దీంతో యానిమల్ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ గా నిలిచింది.
ఇక ప్రస్తుతం ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా ఈ అందాల తార తృప్తి డిమ్రి కనిపించబోతుందట. యానిమల్ సినిమాలో మెరిసిన ఈ అందాల తారకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. శ్యామ్ మర్చంట్ అనే కుర్రాడితో తృప్తి డిమ్రి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ముంబై విమానాశ్రయంలో ఈ ప్రేమ జంట మెరిసింది. హీరోయిన్ తృప్తి డిమ్రిని డ్రాప్ చేసేందుకు.. ఆమె ప్రియుడు శ్యామ్ మర్చంట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అతని కారులో హీరోయిన్ తృప్తి డిమ్రి దిగిన వీడియో వైరల్ గా మారింది. ఇంకేముంది ఈ జంటపై రకరకాలుగా వార్తలు రాసేస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలపై హీరోయిన్ తృప్తి డిమ్రి ఇంకా స్పందించలేదు. క్లిక్






