Tripti Dimri: యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న త్రిప్తి డిమ్రి.. హిట్ మూవీ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది.

Tripti Dimri: యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న త్రిప్తి డిమ్రి.. హిట్ మూవీ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇక స్టార్ హీరోల సరసన నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది. ఇక ఇటీవల త్రిప్తి మరోసారి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో భాగం అయినట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టింది.

దీంతో మరోసారి హిట్ కొట్టి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. ఇక విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న త్రిప్తి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ప్రకటిస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేస్తూ హైప్ పెంచింది. ఈ అమ్మడు ‘ధడక్-2’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు షాజియా ఇక్భాల్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, బ్యానర్స్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం 2018లో వచ్చిన ‘ధడక్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ నటించగా.. ఇప్పుడు ఈ హిట్ మూవీ సీక్వెల్‌లో త్రిప్తి నటించనుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 1న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ఆమె వెల్లడించింది. అలాగే ఓ పోస్టర్‌ను కూడా నెట్టింట షేర్ చేసింది. ఇక ఇందులో హీరో బాధతో హగ్ చేసుకోగా త్రిప్తి ఏడుస్తూ కనిపించింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story