ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పెళ్లి.. డేట్ కూడా చెప్పేసిన బిగ్ బాస్ భామ.. (వీడియో)

by Disha Web Desk 7 |
ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పెళ్లి.. డేట్ కూడా చెప్పేసిన బిగ్ బాస్ భామ.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ఫేమ్, టాన్స్ జెండర్ ప్రియాంక తెలియని వారు ఉండరు. ఈమె అసలు పేరు సాయి తేజ. జబర్ధస్త్ షోలో లేడీ గెటప్‌లతో పాపులారిటీ దక్కించుకున్న సాయి తేజ్.. తన పేరు ప్రియాంకగా మార్చుకున్నారు. ఇక తనకున్న అందం పాపులారిటీతో బిగ్‌బాస్-5 లోకి ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఆ క్రమంలోనే తను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారినట్లుగా వెల్లడించింది ప్రియాంక. ఇక బిగ్ బాస్ అనంతరం మరింత క్రేజ్ దక్కించుకుని బుల్లితెరపై బిజీగా మారారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి క్లారిటీ ఇస్తూ ప్రియాంక ఓ వీడియో పోస్ట్ చేసింది.

వీడియో స్టాటింగ్‌లో ‘‘నాకు పెళ్లి కుదిరింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నేనే మీకు చెప్పాలి అనుకున్న. నాకు నిజంగానే పెళ్లి కుదిరింది. ఈ రోజు జ్యువెలరీ షాపింగ్ కూడా చేస్తున్న. అయితే పెళ్లి ఎప్పుడు.. వరుడు ఎవరు అనేది వీడియో లాస్ట్‌లో చెప్తా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక వీడియో మొత్తం జ్యువెలరీలు పెట్టుకుని సందడి చేసిన ప్రియాంక తన పెళ్లి డేట్ చెప్పింది. ‘‘2024 ఫిబ్రవరి 30’’ అని చెప్పి వీడియో చూసిన వాళ్లందరికి షాక్ ఇచ్చింది. ఇక లాస్ట్‌లో ఇదంతా ప్రాంక్ వీడియో పింకీకి అప్పుడే పెళ్లి కాదు అంటూ చెప్పింది బ్యూటీ.

Next Story