సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్!

by Disha Web Desk 7 |
సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్!
X

దిశ, సినిమా: హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలతో వస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. అయినప్పటికి అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఈ సారి మాత్రం గురితప్పదంటూ ‘మామా మశ్చీంద్ర’ మూవీతో రాబోతున్నాడు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు డిఫరెంట్ షేడ్స్‌లో ఆకట్టుకోనున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే హీరోయిన్స్ ఈషా రెబ్బా, మిర్నాలిని రవిలు ఇద్దరు సుధీర్ బాబులతో మంచి కెమిస్ట్రీలో కూడా కనిపిస్తున్నారు. మొత్తంగా మూవీ మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌ సీన్లతో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.


Next Story